కరోనా మహమ్మారి చిత్రసీమ ప్రముఖులను నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి రోజు ఎవరికో ఒకరికి ఈ కరోనా సోకుతుంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా వారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా ఈయన ఆరోగ్యం విషయంగా ఉందనే వార్తలు వినిపిస్తుండడం తో ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడిందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం మెరుగుపడింది. విషమ పరిస్థితి నుంచి కోలుకుంటున్నారు. ఎప్పటిలాగే ఆయన పాటలతో అలరిస్తారని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. మరో నిర్మాత అశ్వినీదత్ ‘‘బాలు, 40 ఏళ్ళ మన స్నేహ బంధం ఇంకా ఇలాగే 60 ఏళ్ళు సాగాలి నువ్వు తొందరగా లేచి రావాలి.. నీ ప్రియ మిత్రుడు అశ్వినీదత్’’ అని ట్వీట్ చేశారు.