కరోనా మహమ్మారి చిత్రసీమ ప్రముఖులను నిద్ర లేకుండా చేస్తుంది. ప్రతి రోజు ఎవరికో ఒకరికి ఈ కరోనా సోకుతుంది. ఇప్పటికే పలువురికి కరోనా సోకగా వారిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఈయన ఆరోగ్యం సీరియస్ గా ఉందని వైద్యులు చెపుతున్నారు. ఎస్పీ బాలుకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఎస్పీబీ ఉన్నారని హెల్త్ బులిటెన్‌లో ఎంజీఎం పేర్కొంది. కరోనా నుంచి ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని సంగీత ప్రియులూ గురువారం ప్రార్ధనలు చేయాలని తమిళ సినీ పెద్దలు కోరారు.
అలాగే హైదరాబాద్ శివారులోని చిల్కూరు బాలాజీ ఆలయంలోనూ బాలు త్వరగా కోలుకోవాలని బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఎస్పీ బాలసుబ్రమణ్యం చిల్కూరు బాలాజీకి ప్రియమైన భక్తుడని.. ఆయన కోలుకోవాలంటూ ప్రత్యేకమైన ప్రార్థన చేశామని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. స్వామి వారి సన్నిధిలో ఎస్పీ బాలు ఎన్నో పాటలు పాడారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.