నందమూరి తారకరామారావు 97వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు , చిత్ర సీమా ప్రముఖులు , తెలుగుదేశం పార్టీ నేతలు , కార్య కర్తలు జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఆయన కుమారుడు బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు.
జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మాత్రం ఇంటి వద్ద ఉండే తమ తాతకి శ్రద్ధాంజలి ఘటించారు. కరోనా సమయంలో ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వస్తే పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకుంటారు. దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Nandamuri Balakrishna paid his respects to Legendary Nandamuri Taraka Rama Rao garu on his Birth Anniversary at NTR Ghat#NTR#LegendaryNTRJayanthi pic.twitter.com/UEHrRFZaYh
— BARaju (@baraju_SuperHit) May 28, 2020