బాలయ్య విందుకు చిరంజీవి..?

నందమూరి బాలకృష్ణ జూన్ 10 న 60 వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అలాగే ఈసారి పుట్టిన రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అది బాలయ్య షష్ఠిపూర్తి కావడం. దీంతో ఈ ఈవెంట్ ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది నందమూరి కుటుంబం. ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఫ్యాన్స్ ఆత్రుత కనబరుస్తున్నారు. బాలయ్య తన నివాసంలో ఓ భారీ విందు ఏర్పాటు చేయనున్నారని ఈ విందులో నందమూరి కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటారని సమాచారం.

ఈ వేడుకలో అబ్బాయ్ ఎన్టీఆర్ .. అతడి సోదరుడు కళ్యాణ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని అంటున్నారు. ఆ ఇరువురు బాబాయ్ కి అరుదైన కానుకను అందిస్తారని ఫ్యాన్స్ లో ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక వీళ్లతో పాటు పరిశ్రమ తరపున పెద్దగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల వివాదం నేపథ్యంలో తమ మధ్య ఎలాంటి భేషజాలు లేవని చెప్పేందుకు బాలయ్య స్వయంగా చిరుని ఆహ్వానిస్తారని ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. మరి బాలయ్య నిజంగా చిరును పిలుస్తారా లేదా అనేది చూడాలి.