Site icon TeluguMirchi.com

బాల‌కృష్ణలో కొత్త హుషారు!

balakrishnaఅభిమానుల్ని చూస్తే… నంద‌మూరి హీరోల్లో కొత్త ఉత్సాహం వ‌స్తుంది. బాల‌కృష్ణ కూడా అందుకు మిన‌హాయింపు కాదు. బాల‌కృష్ణ పుట్టిన రోజు వేడుక‌లు సోమ‌వారం రామ‌కృష్ణ స్డూడియోస్‌లో కోలాహ‌లంగా జ‌రిగాయి. ఈ కార్యక్రమం ఆద్యంతం బాల‌కృష్ణ హుషారుగా క‌నిపించారు. శుభాకాంక్షలు చెప్పడానికి వ‌చ్చిన అంద‌రినీ ప్రేమ‌గా ప‌ల‌క‌రించారు. దేవిశ్రీ ప్రసాద్‌తో పరాచ‌కాలు ఆడారు. అభిమానుల పేర్లు కూడా ఆయ‌న‌కు గుర్తే. జిల్లా.. అధ్యక్షుల‌ను ఆయ‌న పేరుతో స‌హా ప‌ల‌క‌రించారు. మా బాల‌య్య కొత్తగా క‌నిపించాడ‌ని, అభిమానులు ఆనందోత్సాహాల‌తో చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి డాట్ కామ్ అనే వెబ్‌సైట్ ఆవిష్కరించారు. అందులో నంద‌మూరి అభిమానులంతా త‌మ పేరుని న‌మోదు చేసుకోవాలట‌. లేదంటే… వాళ్లు అభిమానులే కాద‌ట‌. వాళ్లకు బాల‌య్య ఆశీర్వాదాలు ఉండ‌వ‌ట‌. ఈ కొత్తరూలేంటో అర్థం కాక‌.. అభిమానులు కాసేపు బుర్ర గొక్కున్నారు.

Exit mobile version