బాలకృష్ణ రాలేనని తేల్చి చెప్పాడట..

గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్లు , థియేటర్స్ మూతపడడం తో చిత్ర సీమా నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదింపులు జరిపి షూటింగ్స్ కు అనుమతిని కోరారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా షూటింగ్ పర్మిషన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి సినిమా పెద్దలు జూన్ 09 న కలవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఈసారి ఇండస్ట్రీలోని మిగతా వారిని కూడా కలుపుకొని పోవాలని అనుకుంటున్నారట. నందమూరి బాలయ్యని కూడా ఈ మీటింగ్ కి ఇన్వైట్ చేశారట. అయితే బాలకృష్ణ ఈ సమావేశానికి రాలేనని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని సి కళ్యాణ్ తెలియజేస్తూ.. ఈనెల 10న బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఉన్నందున.. ఆయన కుటుంబ సభ్యులు ప్రముఖుల సమక్షంలో షష్ఠి పూర్తి జరుపుకోనున్నారు.. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి రాలేనని చెప్పినట్లు వెల్లడించారు.