భ‌ళా బాల‌య్య

balakrishnaచూడూ… ఒక‌వైపే చూడూ.. రెండోవైపు చూడ‌కు – ఈమ‌ధ్య కాలంలో నంద‌మూరి బాల‌కృష్ణ పాపుల‌ర్ డైలాగ్ ఇది. కానీ బాల‌య్యకు రెండో వైపుంది. అది చూసేకొద్దీ చూడ‌బుద్ధేస్తుంది. మాట్లాడుకొనే కొద్దీ.. ఇంకా మాట్లాడుకోవాల‌ని ఉంటుంది. అది… బాల‌య్య వ్యక్తిత్వం.

ద‌ర్శకుడికి పూర్తిగా స‌రెండ‌ర్ అయిపోయే స్టార్ హీరో ఎవ‌రంటే.. అంద‌రూ ముక్తకంఠంతో చెప్పే పేరు నంద‌మూరి బాల‌కృష్ణ. ఆయ‌న ద‌ర్శకుల హీరో. తొలి సినిమా ద‌ర్శకుడైనా – వంద సినిమాల ద‌ర్శక ధీరుడైనా – వారి చెప్పుచేత‌ల్లో న‌డుచుకొనే ఏకైక హీరో బాల‌కృష్ణ. కాస్త పేరు తెచ్చుకొన్న క‌థానాయ‌కుడు ఎవ‌రైనా స‌రే – ద‌ర్శకుడి పనిలో కాళ్లూ, వేళ్లూ పెట్టి కెలికేస్తుంటారు. త‌మ ప్రతిభ‌ను చూపించాల‌నే ఉత్సాహంతో. కానీ బాల‌య్య అలా కాదు. ఒక్కసారి క‌థ ఒప్పుకొన్న త‌ర‌వాత దర్శకుడి ప‌నిలో జోక్యం చేసుకోరు. కెప్టెన్ మాటే, త‌న మాట‌. తు.చ‌. త‌ప్పకుండా పాటిస్తారంతే!

బాలయ్య వ్యక్తిత్తం కూడా భ‌లే గ‌మ్మత్తుగా ఉంటుంద‌ట‌. ఆయ‌న ద‌గ్గర జోకులేసే ధైర్యం ఎవ‌రూ చేయ‌లేరు గానీ – కాస్త చ‌నువు తీసుకోగ‌లిగితే బాల‌య్యలోని మ‌రో కోణాన్ని చూడొచ్చు. తాను ఇష్టప‌డే వ్యక్తుల ద‌గ్గర బాల‌య్య మ‌రీ చిన్నపిల్లాడైపోతుంటార‌ట‌. జోకులూ, స‌ర‌దాలూ, సంతోషాలూ చాలా ఉంటాయి. కోపం వ‌చ్చినా అంతే. ఎవ్వరినీ వ‌ద‌ల‌రు. ఆధ్యాత్మిక విష‌యాలు, నాన్నగారి జ్ఞాప‌క‌లు… వీటితో ఆయ‌న ద‌గ్గర భ‌లే కాల‌క్షేపం అయిపోతుంది. మీడియాకి ఆయ‌న ఇచ్చే మ‌ర్యాద అంతా ఇంతా కాదు. ఓసారి… మీడియా మిత్రుల గురించి ఓ నిర్మాత చుల‌క‌న‌గా మాట్లాడాడు. ఈ విష‌యం బాల‌య్యకు తెలిసింది. అప్పటికి ఆయ‌న బాలయ్యతో ఓ సినిమా తీస్తున్నారు. నా నిర్మాతే క‌దా.. అని బాల‌య్య లైట్ తీసుకోలేదు. `ఏం.. ఒళ్లు ఎలా ఉంది? మీడియా లేక‌పోతే మీరు, మేం… ఎక్కడున్నాం..` అంటూ కాస్త గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ద‌టీజ్ బాల‌య్య. ఈ రోజు బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈ నంద‌మూరి అంద‌గాడు ఇలాగే క‌ల‌కాలం అభిమానుల‌ను అల‌రించాల‌ని, మ‌రెన్ని విజ‌యాలు సాధించాల‌ని తెలుగు మిర్చీ మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటోంది. హ్యాపీ బ‌ర్తడే టూ నంద‌మూరి బాల‌కృష్ణ.