రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య కామెంట్స్ చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యాయి.
దీనిపై ఓ ఇంటర్వ్యూ లో బాలకృష్ణ స్పందించారు. కేసీఆర్ ను విమర్శించారు కాబట్టే ఆయన వద్దకు వెళ్ళేప్పుడు మిమ్మల్ని పిలవలేదేమో అని యాంకర్ అడగ్గా ఆయనపై చేసిన విమర్శల కారణంగా నన్ను పిలవకపోతే ఆ విషయం నాకు చెప్పాల్సిందని, కేసీఆర్‌గారికి నా మీద ఎప్పుడూ కోపం లేదు. రాజకీయం వేరు.. ఇది వేరని చెప్పుకొచ్చారు. రామారావుగారి అభిమానిగా నేనంటే కేసీఆర్ గారికి ఎప్పుడూ వాత్సల్యం ఉందని మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదని బాలకృష్ణ అన్నారు.