ఏదో ఓ హీరోతో ఆడుకోవడం ఈమధ్య సినిమా వాళ్లకు మరీ ఫ్యాషనైపోయింది. మొన్న యాక్షన్ త్రీడీలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశారు. ఇప్పుడు బలుపులో బాలయ్య ఫ్యాన్స్ తో ఆడుకొన్నారు. రవితేజ-గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన చిత్రం బలుపు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో – రవితేజ బాలకృష్ణ మాడిలేషన్ లో మాట్లాడాడు. అంత వరకూ బాగానే ఉంది. అయితే అర్థం పర్థం లేని పదాలతో, సరిగా లేని వాక్య నిర్మాణాలతో ఎక్కడో మొదలెట్టి, ఇంకెక్కడో ముగించి ఏదోదో మాట్లాడడం బాలయ్య ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఎందుకంటే బహిరంగ వేడుకల్లో బాలకృష్ణ స్పీచ్ అలాగే ఉటుంది. ఇది కేవలం తమ హీరోని అవమానించడానికే అని నందమూరి ఫ్యాన్స్ బాగా పీలవుతున్నారు. ఈ సన్నివేశం.. బలుపుకి ప్లస్ అనుకొంటే – అదే మైనస్ అయి కూర్చుంది. మరి నందమూరి ఫ్యాన్స్ ఫీలింగ్స్‌ని ఈ బలుపు టీమ్ ఎంత వరకూ అర్థం చేసుకొంటుందో చూడాలి.