కరోనా టెస్టుల్లో నాలుగు లక్షలు మైలురాయిని దాటేసిన ఏపీ

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు లు ఇవ్వడం..జనాలు రోడ్ల పైకి రావడం , దేశమంతా కూడా సాధారణ పరిస్థితి కి చేరుకోవడం తో కేసులు విపరీతమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా టెస్టులు చేయకుండా ఉండగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కరోనా టెస్ట్ ల్లో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది.

తాజాగా నాలుగు లక్షలు మైలురాయిని దాటేసింది ఏపీ. జూన్ 4వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల సంఖ్య 4,13,773కి చేరినట్టు ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జ శ్రీకాంత్‌ ప్రకటించారు.. ఇక, ఇందులో 4,112 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించడం జరిగింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 3,377 మంది కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 616 మంది, విదేశాల నుంచి తిరిగి వచ్చినవారు 119 మంది ఉన్నారని పేర్కొన్నారు.. మే 1వ తేదీ నాటికి రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ పరీక్షల సంఖ్య లక్ష దాటగా… సరిగ్గా నెల రోజుల్లో ఆ సంఖ్య ఏకంగా 4 లక్షలు క్రాస్‌ చేసినట్టు తెలిపారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పరీక్షల సంఖ్య ను మరింత వేగవంతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచడంతో మొత్తం 4,13,733 కోవిడ్ టెస్ట్ ల మైలు రాయిని చేరింది.