కొత్త జేడీ వచ్చేశారు

arunachalamవైయస్ జగన్ అక్రమ ఆస్తులు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనులు, ఎమ్మార్… తదితర కేసులు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ ఇటీవలే బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త జాయింట్ డైరెక్టర్ అరుణాచలం బాధ్యతలు  స్వీకరించారు. డిప్యుటేషన్ కాలం ముగియడంతో లక్ష్మీ నారాయణ ఈ నెల 11న సొంత కేడర్ మహారాష్ట్రకు వెళ్లిపోయారు. దీంతో చెన్నై సిబిఐ జెడి అరుణాచలం రాష్ట్ర సిబిఐ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయానికి వచ్చి విధుల్లో చేరిన అరుణాచలం మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్ధన రెడ్డి మైనింగ్ కేసుతో సిబిఐకు అందులో ఉన్న జేడీకి ఎక్కడలేని ప్రచారం వచ్చింది. అయితే ఆయన ఓ వర్గం మీడియాకు సమాచారమిచ్చాడని, పక్షపాతంగా వ్యవహరించారని విమర్శలతో పాటు నిజాయితీకి మరో రూపంలో మెలిగారనే పేరునుసంపాదించుకున్నారు. మరి ఆయన స్థానంలో వచ్చిన  కొత్త జెడి అరుణాచలం రాష్ట్రంలో రాజకీయాలతో ముడివేసుకున్న కేసుల్లో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.