ఆర్యతో అనుష్క బిజీ బిజీ

అనుష్క కు ఈ మధ్య అవకాశాలు పెరుగుతున్నాయనే చెప్పాలి. నాగ్ తో జంట కట్టిన ‘డమరుకం’ రిలీజ్ కు రెడీ గా ఉంది. డమరుకం తర్వాత తెలుగు లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మిర్చిలో జత కట్టింది ఈ యోగా బ్యూటీ. ఇక తమిళం లో  కార్తీ సరసన చేస్తున్న ‘బాడ్ బాయ్’ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పుడు ఆర్యతో రొమాన్స్ చేస్తోంది ఈ బొమ్మాళి. అదేనండీ.. సెల్వ రాఘవన్ దర్శకత్వం లో ఆర్య హీరో గా తెరకెక్కుతున్న ‘బృందావనంలో నందకుమారుడు’ సినిమా షూటింగ్  పాల్గొంటోంది. ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని జార్జియాలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. తమిళంలో ఈ చిత్రానికి  ‘ఇరందం ఉలగం’ అనే టైటిల్ పెట్టారు. హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం 2013 లో విడుదలయ్యే అవకాశం వుంది. గుణశేఖర్ భారీస్థాయి లో ప్లాన్ చేస్తున్న ‘రాణి రుద్రమ’ లో కూడా అనుష్క  కధానాయక. సో అనుష్క ఇప్పుడు  చాలా బిజీ అన్నమాట.