Site icon TeluguMirchi.com

కాస్టింగ్ కౌచ్ ఫై అనుష్క ఏమన్నదంటే..

సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్..ఇది ఈనాటిది కాదు ఎప్పటి నుండి జరుగుతుందే..కాకపోతే గత ఏడాది నుండి ఈ పదాన్ని చాల ప్రత్యేకంగా చూస్తున్నారు. సీనియర్ ..ఇప్పటి హీరోలంతా తమకు జరిగిన సంఘటనలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు సంఘటనల గురించి తెలుపగా..

తాజాగా కాస్టింగ్ కౌచ్ పై అనుష్క స్పందించింది. తాను ఇండ‌స్ట్రీలో ఇలాంటి వేధింపుల బారిన ప‌డ్డాన‌ని పేర్కొంది. సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌నే విష‌యం అందరికి తెలిసిన విష‌య‌మే, ఇందులో సీక్రెట్ ఏమి లేదు. నేను కూడా కాస్టింగ్ కౌచ్ వ‌ల‌న ఇబ్బంది ప‌డ్డాను. ముక్కుసూటిత‌నం, ధైర్యంగా ఉండ‌డం వ‌ల‌న త‌ప్పించుకోగ‌లిగాను. స్ట్రైట్ ఫార్వ‌ర్డ్‌గా ఉంటాను కాబ‌ట్టే ఎవ‌రు నాతో మిస్ బిహేవ్ చేయ‌లేదు అని పేర్కొంది అనుష్క‌. నిశ్శ‌బ్ధం సినిమా ప్ర‌మోషన్‌లోను అనుష్క కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. కొత్త‌గా వారికి ఇలాంటి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని పేర్కొంది. ఇండ‌స్ట్రీలో ఇలాంటి వాటికి లొంగ‌కుండా ఎక్కువ కాలం ఉండేందుకు క‌ష్ట‌మైన మార్గాన్ని ఎంచుకున్నాన‌ని త‌న ప్ర‌యాణం గురించి చెప్పుకొచ్చింది.

Exit mobile version