బాలీవుడ్ చిత్రసీమలో వరుస ఆత్మహత్యలు కలకలంరేపుతున్నాయి. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య ను జీర్ణించుకోలేకపోతున్న సినీ ప్రేక్షకులు , సినీ ప్రముఖులు మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తాజాగా సినీ,టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది.
అనుపమ పలు సినిమాలల్లో సైడ్ క్యారెక్టర్లలో మరియు సీరియళ్లలో ప్రధాన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం వెండితెర, బుల్లితెర ఫై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉండేది. బీహార్లోని పూర్నియా జిల్లాకు చెందిన అనుపమ నటన నిమిత్తం ముంబైలో ఉంటుంది. ఆమె మరణానికి ఒకరోజు ముందు ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ లోకంలో ఎవరిని నమ్మవద్దని,ప్రజలు స్వార్దపరులని పేర్కొంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.