Site icon TeluguMirchi.com

కాస్టింగ్ కౌచ్ ఫై అనసూయ ఏమంటుందో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్..ఇది ఈనాటిది కాదు ఎప్పటి నుండి జరుగుతుందే..కాకపోతే గత ఏడాది నుండి ఈ పదాన్ని చాల ప్రత్యేకంగా చూస్తున్నారు. సీనియర్ ..ఇప్పటి హీరోలంతా తమకు జరిగిన సంఘటనలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు సంఘటనల గురించి తెలుపగా..

తాజాగా కాస్టింగ్ కౌచ్ పై పాపులర్ యాంకర్ అనసూయ స్పందించింది. ”ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఇండస్ట్రీలో మీటూ కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండొచ్చు. కానీ అది అమ్మాయి మీదే డిపెండై ఉంటుంది. ఆఫర్ ఇస్తానని ఎవరైనా ఏదైనా అడిగితే.. ఈ ఆఫర్ రావాలంటే ఇతను ఇలా అడుగుతున్నాడు.. ఇది కాకపోతే మరొకటి వస్తుందని డ్రాప్ కావచ్చు. అలా డ్రాప్ కాని ఆడవాళ్ళే ఈ కాస్టింగ్ కౌచ్ కి బలైపోతున్నారు. మీ టాలెంట్ ని మీరు నమ్ముకోండి. బయట కాంపిటేషన్ లేదని చెప్పడం లేదు. నేను చేసే క్యారెక్టర్స్ నా కంటే బాగా చేసే మరో పది మంది ఉండొచ్చు. కానీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి” అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా ”నేను కూడా ఫేవరిజానికి బలై చాలా ఛాన్సెస్ మిస్ అయ్యాను. కానీ ఎప్పుడూ బయటకు చెప్పి రాద్ధాంతం చేయలేదు. ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి బయటపెడుతున్నా. ఓ గ్రూప్ ఫేవరిజం వల్ల రెండేళ్ల క్రితం నేను కొన్ని అవకాశాలు కోల్పోయాను. అయినా నన్ను నేను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నా. ఈ క్యారెక్టర్ నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అనేంతలా కష్టపడాలి. లైఫ్ లో అదే టార్గెట్ పెట్టుకుంటే కాస్టింగ్ కౌచ్ కాదు కదా.. కాస్టింగ్ పిల్లో కూడా నీ దగ్గరకు రాదు” అని అనసూయ చెప్పుకొచ్చింది.

Exit mobile version