నాగేశ్వరరావు మెచ్చుకున్నారు..

anr and srinivas reddy“చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్న నాకు.. దక్కిన ఓ గొప్ప అవాకాశం ‘డమరుకం’. చాలా కసితో, పట్టుదలతో తీసిన సినిమా ఇది. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది” అని సంతోషం వ్యక్తం చేసారు… శ్రీనివాసరెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన ‘డమరుకం’ ఇటీవలే విడుదలయ్యింది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ లో విలేఖరులతో మాట్లాడారు. “నాగార్జున ఇప్పటివరకూ అన్ని రకాల సినిమాలూ చేసారు. సోషియో ఫాంటసీ లో మాత్రం నటించలేదు. అందుకే ఈ కధ ఆయన దగ్గరకు తీసుకెళ్లా. కుటుంబ ప్రేక్షకులు అందరూ చూసేలా తీయాలని నాగ్ ముందే చెప్పారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఈ సినిమా తీసా. ఈ సినిమా చూసి నాగేశ్వర రావు మెచ్చుకున్నారు. “పాతాల భైరవి గుర్తొచ్చింది. ప్రతినాయకుడి పాత్ర… బాగా తీర్చిదిద్దావ్’ అన్నారు. విడుదల విషయంలో జాప్యం జరిగినప్పుడు నిరాశ పడ్డా. శివుడి ఆజ్ఞతో… కార్తీక మాసం లో విడుదల కావడం ఆనందాన్ని ఇచ్చింది” అన్నారు.