Site icon TeluguMirchi.com

బాబుకు అక్కినేని అభినందన

cbn anrమాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ను ప్రముఖ సినీనటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కలిసారు. వేరెవ్వరూ స్పందించని రీతిలో ఉత్తరాఖండ్ విషయంలో చంద్రబాబు స్పందించిన తీరును ఆయన ప్రస్తుతించారు. బాధితులను పరామర్సించటం లోనూ, వారికి కావలసిన ఏర్పాట్లు చేయటం లోనూ, తెలుగువారిని డెహ్రాడూన్ నుంచి వారి వారి స్వస్థలాలకు తరలించటం లోనూ చంద్రబాబు ఎంతో బాధ్యతగా ప్రవర్తించారని, ఇది నిజంగా అభినందనీయమని అక్కినేని చంద్రబాబును వ్యక్తిగతంగా కొనియాడారు. షుమారు అరగంటకు పైగా వారిరువురు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎటువంటి రాజకీయ చర్చలు రాలేదని, కేవలం వ్యక్తిగతమని పార్టీ వర్గాలు తెలిపాయి.

Exit mobile version