Site icon TeluguMirchi.com

అంజలికి ఆ ఇల్లే సెంటిమెంటయిందిట

తెలుగుంటి అమ్మాయి తాజాగా చెన్నై ఇంటి అమ్మాయి అయింది. ఇంతకీ ఎవరా సుందరి అంటే… అప్పుడెప్పుడో శివనాగేశ్వర రావు దర్శకత్వంలో వచ్చి.. పోయిన “ఫోటో” చిత్రంలో కథానాయికే ఈ అమ్మాయి. పేరు అంజలి. తెలుగమ్మాయే అయినా , తెలుగు సినిమాతోనే మొదటిసారి ముఖానికి రంగేసినా ఎందుకనో మన పక్కింట్లోనే పేరు సంపాదించుకోగలిగింది. తమిళ డబ్బింగ్‌ చిత్రం “షాపింగ్‌ మాల్‌” తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తెలుగులో ఏకంగా విక్టరీ వెంకటేశ్‌ సరసన “సీతమ్మ వాకిట్లో….” చిత్రంలో జతకట్టడంతో వెలుగులోకి వచ్చింది అంజలి. తమిళ చిత్ర రంగంలో మంచి ఆఫర్లతో తనకంటూ ప్రత్యేకమయిన స్థానం సంపాదించుకున్న అంజలి, మొదట్లో తను ఏ ఇంటిలో అయితే అద్దెకు దిగి నివసించిందో అదే ఇంటిని ఇప్పుడు తన కష్టార్జితంతో కొనుగోలు చేసిందట. అక్కడే తనకు మంచి గుర్తింపు రావడంతో ఆ ఇంటిని కలిసివచ్చిన సెంటిమెంట్‌ గా భావించి, కొనేసిందని సమాచారం. ఇప్పుడు ఆ ఇంటికి తన టేస్ట్‌ కు తగ్గట్టు రీమోడలింగ్‌ చేయించే పనిలో ఉందట. ప్రస్థుతం తెలుగులో “సీతమ్మ వాకిట్లో…”, రవితేజ “బలుపు” చిత్రాలతో బిజీగా ఉన్న మన తెలుగమ్మాయి అంజలి మరిన్ని మంచి ఆఫర్లు రావాలని కోరుకుందాం.

Exit mobile version