Site icon TeluguMirchi.com

సింగం-2 లో అంజలి ?

Anjali“లవ్‌ ఇన్‌ షాపింగ్‌ మాల్‌” చిత్రంతో తన “జర్నీ” ప్రారంభించిన పదహారణాల తెలుగుంటి ముద్దుగుమ్మ అంజలి. అనూహ్యంగా ఎంతోకాలం తర్వాత తెలుగులో వస్తోన్న భారీ మల్టీ స్టారర్‌ చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” లో ఏకంగా విక్టరీ వెంకటేశ్‌ సరసన్‌ నటించే అవకాశం కొట్టేసింది. దీంటో అమ్మడి రేంజ్‌ మారిపోయింది. తెలుగు ఇండస్ట్రీ చూపు అంజలిపై పడింది. పవన్‌ కళ్యాణ్‌ సరసన్‌ అవకాశం కొట్తేసిందంటూ వార్తలొచ్చాయి. అలాగే రవితేజ, శృతిహాసన్‌ కాంబినేషన్‌ లో వస్తున్న “బలుపు”లో అవకాశం చేజిక్కించుకుంది. అంతే కాదు… మంచినటిగా గుర్తింపు  తెచ్చుకున్న తమిళ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. అంజలికి తాజాగా తమిళ అగ్రహీరో సూర్యతో తెర పంచుకునే బంపర్‌ ఆఫర్‌ వచ్చిందని సమాచారం. సూపర్‌ హిట్‌ అయిన సింగం సినిమాకు సీక్వెల్‌ గా వస్తోన్న “సింగం-2” లో అంజలిని ఓ పాత్రకు ఎంపిక చేశారని తెలిసింది. తమిళంలో ఇప్పటివరకూ చిన్నా చితకా హీరోల పక్కన నటిస్తూ వచ్చిన అంజలి ఓ పెద్ద హీరో చిత్రంలో కనిపించడం తొలిసారి అవుతుంది. ఈ దెబ్బతో అంజలి ఇటు తెలుగులో, అటు తమిళంలో పేద్ద హీరోయిన్ల జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది. ఆల్‌ ది బెస్ట్‌ అంజలీ!

Exit mobile version