బాబును’దేశం’లో చేర్చిందేవరు?

chandrababu naiduతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ను ‘దేశం ‘ పార్టీలోకి తీసుకొచ్చింది ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డియా? ఇది నిజమా ? నిజమే మరి. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా ఆర్ధికమంత్రి సోమవారం నాడు విలేకరులతో చెప్పారు. 1983 లో విజయవాడ లో మహానాడు జరుగుతుండగా చంద్రబాబు నెల్లూరులోని తన నివాసానికి వచ్చారని, తనకు కూడా మహానాడుకు రావాలన్న ఆసక్తి వుందని, తనను విజయవాడ తీసుకువేళ్ళవలసిందిగా కోరారని ఆనం చెప్పారు. ఆయన ఆరోజు భయం భయంగా వుంటే తానే ధైర్యం చెప్పి తన కారులోనే విజయవాడకు తీసుకు వెళ్లానని ఆనం వివరించారు.. మహానాడుకు వచ్చిన బాబు బెదురు బెదురుగా ఒక మూల నిలబడి పోయారని, తను ఆయనకు నైతికస్థైర్యాన్ని కల్పించి ముఖ్య నేతలందరికీ పరిచయం చేసానని, బాబును పార్టీ లో చేర్చుకోవలసిందిగా కోరానని, తన కోరిక మేరకే ఆయనను పార్టీలోకి ఆహ్వానించారని ఆనం చెప్పారు. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్ల క్రితమే ఆనం ఏర్పాటు చేసిపెట్టారన్నమాట.