Site icon TeluguMirchi.com

ఇది విన్నారా.. అమరేంద్ర బాహుబలి బ్రతికే ఉన్నాడట!

bahubali 2దర్శధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ప్రస్తుతం ఫిల్మ్‌ నగర్‌లో హాట్‌ టాఫిక్‌గా మారింది. దాదాపు రెండేళ్ల క్రితమే మొదటి పార్టు విడుదలయిన ఈ చిత్ర రెండో పార్టు ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి పార్టు చివర్లో సింహాసనానికి కట్టుబడి ఉండే కట్టప్ప అమరేంద్ర బాహుబలిని చంపాడు. అప్పటి నుండి ఇప్పటి దాకా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఎదురవుతూనే ఉంది కానీ ఒక్కరు కూడా టంగ్‌ స్లిప్‌ అవడం లేదు. ఈ కథ రచించిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని అడిగితే అబ్బే కట్టప్ప బాహుబలిని పొడిచాడు అంతే, బాహుబలి చనిపోలేదు అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు.

రచయిత చెప్పినట్టు ఈ చిత్రంలో అమరేంద్ర బాహుబలి బ్రతికే ఉన్నాడనే అనుమానాలు తాజాగా వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమా షాట్స్‌ అక్కడక్కడా చూసిన వారు శివుడి పాత్రను పోషించిన మహేంద్ర బాహుబలి ఒక ముసలాయనతో మాట్లాడతాడట. అయితే ఈ చిత్రంలో ప్రభాస్‌ తాత పాత్రను కూడా పోషిస్తున్నాడు అనే టాక్‌ వినిపించింది. కానీ నిజానికి ప్రభాస్‌ తాత క్యారెక్టర్‌ చేయలేదట. వృద్దునిగా ఉన్న అమరేంద్ర బాహుబలి పాత్రనే పోషించాడట. అమరేంద్ర బాహుబలి తండ్రిగా వేరే నటుడు ఉన్నాడు. అది పెయింటింగ్‌లోనే తెలిసిపోయింది. శివుడు ముసలాయనతో మాట్లాడటం అది ప్రభాస్‌నే కాబట్టి బాహుబలి చివరకు చనిపోలేదేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version