Site icon TeluguMirchi.com

ఈ అల్లరోడు ఇక‌.. ల‌డ్డూబాబు!

allarinarshఅల్లరి సినిమాతో అటు న‌రేష్‌, ఇటు ర‌విబాబు సినీ రంగంలో స్థిర‌ప‌డిపోయారు. ఇప్పుడు వీరిద్దరి క‌ల‌యిక‌లో మరో సినిమా వ‌స్తోంది. ఈ చిత్రానికి ఫ‌న్నీ టైటిల్ పెట్టేశారు ర‌విబాబు. అదే.. ల‌డ్డూబాబు. ఈ చిత్రంలో భూమిక ఓ ప్రత్యేక పాత్రలో క‌నిపించ‌నుంది. క‌థానాయిక‌, మిగిలిన సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వర‌లో ప్రక‌టిస్తారు. న‌రేష్ సినిమా యాక్షన్ ఇటీవ‌లే ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. కెవ్వు కేక త్వర‌లోనే విడుద‌ల కానుంది. కెవ్వు కేక ప‌నులన్నీ పూర్తయ్యాకే.. లడ్డూబాబు సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి.

Exit mobile version