అల్లరోడి హ్యాపీ బ‌ర్త్ డే!

Allari-Nareshకామెడీని క‌రివేపాకులా తీసిపాడేస్తారు గానీ – అది మైసూర్‌పాక్ లాంటిది. న‌వ్వుల్ని న‌మ్ముకొన్నవాడు నాశ‌న‌మైపోయిన‌ట్టు సినీ చ‌రిత్రలోనే లేదు. అల్లరి న‌రేష్‌నే తీసుకోండి. మాస్ హీరోగానే, ల‌వ‌ర్‌బోయ్‌గానో మారిపోతే అంద‌రిలానే యేడాదికి ఒక‌ట్రెండు సినిమాలో స‌రిపెట్టుకొందుడు. కామెడీ కింగ్‌గా మారాడు కాబట్టే యేడాదిని నాలుగైదు సినిమాలో బిజీ హీరోగా మారాడు. అల్లరి నుంచి అల్ల‌రి 2 (ల‌డ్డూబాబు) వ‌ర‌కూ అత‌ని ప్రయాణం… కిత‌కిత‌ల‌మ‌య‌మే. ఓ అగ్ర ద‌ర్శకుడి త‌న‌యుడు అయినా – త‌న కాళ్లపై తాను నిల‌బ‌డి త‌న‌కంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకొన్నాడు. న‌రేష్ సినిమా అంటే అటు నిర్మాత‌ల‌కు, ఇటు బ‌య్యర్లకూ హ్యాపీనే! అందుకే న‌రేష్ అంద‌రికీ కావ‌ల్సిన హీరో. న‌రేష్ ప్రయాణం ఇలాగే ఆరు జోకులూ, మూడు పంచ్‌ల‌తో కొన‌సాగాల‌ని తెలుగు మిర్చి మ‌న‌స్ఫూర్తిగా కోరుకొంటోంది.