అల్లరి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నరేష్. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకొన్నాడు. దర్శకుడిగా రవిబాబుకీ అదే తొలి సినిమా. అతనూ అల్లరి రవిబాబు అయ్యాడు. వీరిద్దరూ మరోసారి జట్టు కట్టారు. నరేష్ కథానాయకుడిగా మహారథి ఫిలిమ్స్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. రవిబాబు దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం గురువారం ఉదయం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఇది రెగ్యులర్ కామెడీ సినిమా కాదు… డిఫరెంట్ గా ఉంటుందని రవిబాబు చెబుతున్నారు. కథానాయిక, మిగిలిన సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.