నచ్చావ్ అల్లుడు తరవాత హీరో వేషాలేం వెయ్యలేదు అలీ. చేయడానికి అంత తీరిక కూడా లేదనుకోండి. హాస్యనటుడుగా మాంఛి బిజీలో ఉంటాడుకదా..? ఇప్పుడు మాత్రం కాస్త ఖాళీ చూసుకొని హీరో వేషాలెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అలీ కథానాయకుడుగా అలీబాబా – ఒక్కడే దొంగ అనే చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఫణి ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. బొడ్డా శివాజీ నిర్మాత. ఈనెల 18న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. అలీబాబా నలభై దొంగలు, అలీబాబా అరడజను దొంగలూ అయితే మా అలీ బాబా మాత్రం ఒక్కడే. సింగిల్‌గా వచ్చి దోచికెళ్లిపోతాడు… అని దర్శకుడు చెబుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరుదామని వచ్చి.. దొంగగా మారిన అలీ కథ ఇది. మరి ఆయన ఎంత వినోదం పంచి పెడతారో చూడాలి. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్.