ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ పార్టీ అధ్యక్షుడు అజిత్ జోగి (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన మే 9న రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యం అత్యంత విషమించడంతో వెంటిలేటర్లపై శ్వాస అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో అజిత్ జోగి మరణించినట్టు ఆయన తనయుడు అమిత్ జోగి ట్విటర్‌లో వెల్లడించారు.
1946 ఏప్రిల్ 29న బిలాస్‌పూర్‌లో జన్మించిన అజిత్ జోగి కాంగ్రెస్‌లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే 2000సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రిగా (2000-2003 మధ్యకాలంలో) అజిత్ జోగి బాధ్యతలు చేపట్టారు.