మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో ఆచార్య మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో సినిమా తాలూకా అనేక విషయాలు బయటకొస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి.నిన్న చిరంజీవి పుట్టిన సందర్భాంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ చిత్రం వివాదాల్లోకి చిక్కుకుంది. కన్నెగంటి అనిల్ కృష్ణ అనే రచయిత.. ఇది నా కథే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ‘ఆచార్య’ టైటిల్ తర్వాత వచ్చే సన్నివేశం తను రాసుకున్న కథలోని సన్నివేశంలానే ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ సన్నివేశంకు సంబంధించిన కథను ‘పుణ్యభూమి’ అనే టైటిల్‌తో 2006లో రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేయించినట్లుగా ఆయన చెబుతున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు స్టార్ హీరోల, దర్శకుల సినిమాల విషయంలో చేసి ఒక్కసారిగా వెలుగులోకి రావాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. మరి ఇవి అలాంటి ఆరోపణలో లేక నిజంగానే కొరటాల కాపీ చేశారో తెలియాలంటే.. ‘ఆచార్య’ టీమ్ స్పందించాల్సిందే.