రీసెంట్ గా కేంద్రం వలస కూలీలను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు శ్రామిక్ ట్రైన్స్ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు నుండి 200 ప్రత్యేక రైళ్లు పరుగులు పెట్టబోతున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో జూన్ 30 వరకు దాదాపు 26 లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. తొలి రోజు లక్ష నలభై ఐదు వేల మంది ప్రయాణిస్తారని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే శాఖ మరోసారి ప్రయాణికులకు పలు సూచనలు చేసింది. ప్రయాణికులంతా 90 నిమిషాల ముందే రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్, ఆర్ఏసీ టికెట్ ఉన్నవారినే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పింది. ప్రయాణికులందరికీ స్ర్కీనింగ్ నిర్వహిస్తామని, ఎలాంటి లక్షణాలూ లేని వారికి మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని రైల్వేశాఖ స్పష్టంచేసింది.