Site icon TeluguMirchi.com

స్వర్ణ ప్యాలెస్ కు ఊరట

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం 10 మందిని కబళించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రమాదం కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై హైకోర్టులో జరిగిన విచారణలో రమేశ్ ఆసుపత్రి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

విచారణ సందర్భంగా హైకోర్టు… స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కొవిడ్ కేర్ సెంటర్ గా అనుమతించిన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎం అండ్ హెచ్ఓలను ఎందుకు బాధ్యులుగా చేయలేదని ప్రశ్నించింది. స్వర్ణ ప్యాలెస్ ను గతంలో ఎయిర్ పోర్టు క్వారంటైన్ సెంటర్ గా నిర్వహించారా? లేదా? అని అడిగింది.

Exit mobile version