సోనూసూద్ ను విలన్ కాదు హీరో ..

అరుంధతి చిత్రంలో పశుపతి గా అందర్నీ మెప్పించిన సోను సూద్..రీసెంట్ గా వలస కార్మికులను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లాలో నాగేశ్వరరావు దున్నేందుకు ఎద్దులు లేక సతమతమవుతుంటే.. ఆయన కన్నబిడ్డలే కాడిపట్టుకుని నడిచారు. వాళ్లిద్దరూ కాడి లాగుతుంటే.. వెనక నుంచి రైతు, ఆయన భార్య విత్తనాలు వేసుకుంటూ వచ్చారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియా లో ఓ వ్యక్తి అప్లోడ్ చేయగా అది వైరల్ అయ్యింది.ఇది చూసిన సోనూసూద్ వెంటనే సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మొదట ఆ రైతులకు ఓ జత ఎద్దులు పంపుతానని వెల్లడించారు.

కొంతసేపటి తర్వాత వారు ఎద్దులు కాదు.. వారికి కావాల్సింది ఓ ట్రాక్టర్ అని ట్వీట్ చేశారు. వారికి సాయంత్రాని కల్లా ట్రాక్టర్ పంపిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే షోరూం నిర్వాహకులు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు. సోనూసూద్ గొప్ప మనసుపై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.