అరుంధతి చిత్రంలో పశుపతి గా అందర్నీ మెప్పించిన సోనూసూద్..లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక అప్పటినుండి ప్రతి రోజు ఎవరు ఏ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు.
ఈయన చేస్తున్న మంచి పనులకు ప్రతి ఒక్కరు అభిమాని అయ్యారు. ప్రస్తుతం సోనూ రేంజ్ పిక్ లోకి వెళ్లడం తో ఈయన పాపులారిటీని, వ్యక్తిగత ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలని పలు కార్పొరేట్ కంపెనీలు, ప్రముఖ వ్యాపారసంస్థలు వాణిజ్య ప్రకటనల్లో నటించాల్సిందిగా భారీ పారితోషికం ఆఫర్ చేస్తున్నాయట. అయితే సోనూ మాత్రం ఇందుకు సంసిద్ధంగా లేరని తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ప్రకటనల్లో నటించనని సున్నితంగా తిరస్కరిస్తున్నారట. ఒకవేళ నటించినా వచ్చే ఆదాయంలో ఎక్కువశాతం పేదల అభ్యున్నతికి ఖర్చుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.