హీరో సూర్యకు కజిన్..ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమిళంలో ఎన్నో సినిమాలు చేసి, వాటిని తెలుగులో అనువాదం చేసి ఆకట్టుకున్న ఈయన..తన స్నేహితులతో కలిసి రామనాథరాపురం జిల్లాలో ఫైనాన్స్ వ్యాపారంలో రూ. 300 కోట్ల మేరకు ఖాతాదారులకు కుచ్చు టోపీ పెట్టే ప్రయత్నం చేశారని కేసు నమోదైంది. జ్ఞానవేల్‌రాజా సినిమాలకు కోట్ల రూపాయల్లో మణి అండ్ గ్యాంగ్ ఫైనాన్స్ ఫైనాన్స్ చేసేది. ఇప్పుడు ఈ సంస్థ పేరుతో కోట్లలో చీటింగ్ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో రామానాథపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై జ్ఞానవేల్ రాజా స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులకు వివరణ ఇస్తారని మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారు.
మణి అండ్ గ్యాంగ్ సంస్థకు తనకు సినిమా లావా దేవీలు తప్ప తనకు ఎటువంటి సంబంధాలు లేవని వివరణ ఇచ్చారు. అయితే ఆగష్టు 7న రామనాథపురం పోలీస్ స్టేషన్‌కి నేరుగావెళ్లి వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు జ్ఞానవేల్ రాజాకు నోటీసులు జారీ చేసింది.