సుశాంత్‌పై విషప్రయోగం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుపై భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌పై విషప్రయోగం జరిగిందని.. ఈ విషయం తెలియకుండా ఉండేందుకే శవపరీక్షను ఆలస్యంగా నిర్వహించారని ఆయన సామాజిక మాధ్యమాల్లో ఆరోపించారు.

‘‘హంతకుల క్రూర స్వభావం, వారి ప్రమేయం నెమ్మదిగా బయటకు వస్తోంది. ఎస్‌ఎస్‌ఆర్‌ జీర్ణాశయంలో ప్రయోగించిన విషం ఆనవాళ్లు లేకుండా పోవాలనే ఉద్దేశంతో.. శవపరీక్షను కావాలనే ఆలస్యం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలి.’’ అంటూ స్వామి డిమాండ్‌ చేశారు.