ఐపీఎల్ నుంచి సీనియర్ ప్లేయర్ సురేశ్ రైనా తప్పుకోవడం వివాదాస్పదమైంది. తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు రైనా దూరం కావడం వెనక పలు కారణాలున్నాయని ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్ రూము విషయంలో తలెత్తిన విభేదాల వల్లే రైనా అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నాడని మరో వార్త వెలుగులోకి వచ్చింది. దీనికి అతడు తన బంధువు మరణాన్ని సాకుగా చూపి స్వదేశానికి చేరుకున్నాడని ఆ వార్తల సారాంశం.
అయితే, అసలు కారణం అదికాదని, దుబాయ్లో తనకు కేటాయించిన హోటల్ రూము విషయంలో రైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని, ఆ రూములో తనకు బాల్కనీ లేదని, ధోనీకి కేటాయించిన లాంటి గది కావాలని యాజమాన్యంతో గొడవకు దిగినట్టు చెబుతున్నారు. ఈ విషయంలో ధోనీ కూడా రైనాపై మండిపడ్డాడని సమాచారం.