కేజీఎఫ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడగా, ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో త్వరలోనే ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 2021 సంక్రాంతి బరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ అనగా కోలార్ బంగారు గనులు. ఆ గనుల పై ప్రపంచ మాఫియా కన్ను ఎలా ఉండేది అన్న దానిని తొలి భాగంలోనే అద్భుతంగా చూపించారు దర్శకుడు. ఇక పార్ట్ 2ల ఇంకా భీకర మాఫియాని పతాక స్థాయిలో చూపించనున్నట్టు తెలుస్తుంది. కేజీఎఫ్ 2 చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు.