షూటింగ్ కు రెడీ అంటున్న క్రేజీ భామ

వరుస హిట్స్ తో తన హావ కొనసాగిస్తున్న రష్మిక షూటింగ్ కు సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం అల్లుఅర్జున్‌ ‘పుష్ఫ’ చిత్రంలో నటిస్తున్న ఈ కన్నడ భామ లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుండి బెంగళూరులో ఇంటిపట్టునే వుంటుంది. కరోనా వల్ల అడుగుకూడా బయటపెట్టలేకపోతున్నా అంటోన్న ఈ భామ.. షూటింగ్‌లకు మాత్రం రెడీ అంటోంది.

ఈ సమయంలో మీరు షూటింగ్‌కు రెడీగా వున్నారా..? అని ఈ అమ్మడిని ప్రశ్నిస్తే ‘నా దర్శక, నిర్మాతలు షూటింగ్‌కు రమ్మని అంటే తప్పకుండా వస్తాను. తగు జాగ్రత్తలు పాటిస్తూ నేను చిత్రీకరణలో పాల్గొంటాను. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రస్తకే లేదు’అని తేల్చి చెప్పింది. కానీ ఈమె రెడీ అంటున్న హీరోలు మాత్రం ఇప్పట్లో షూటింగ్ లో జాయిన్ అయ్యే ప్రసక్తి లేదని చెపుతున్నారు. కరోనా ఉదృతి తగ్గే వరకు ఎలాంటి షూటింగ్ లలో చేరమంటూ ఆయా నిర్మాతలకు చెపుతున్నారట.