శేఖర్ కమ్ముల తండ్రి కన్నుమూత ..

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) అనారోగ్యంతో శ‌నివారం ఉదయం 6 గంటలకు ఆసుపత్రిలో క‌న్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఈరోజు ఉదయం కన్నుమూయడం తో కమ్ముల ఇంట్లో విషాదం నెలకుంది.

శ‌నివారం సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జ‌రుగుతాయ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ‘లవ్‌స్టోరి’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.