Site icon TeluguMirchi.com

వివేకానందరెడ్డి ఇంట్లో మళ్ళీ సోదాలు

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు చేధించడానికి సీబీఐ మరోమారు పులివెందులలో ఆయన నివాసాన్ని పరిశీలించింది. పదిమందికి పైగా సీబీఐ అధికారుల బృందం వివేకా హత్య జరిగిన ప్రదేశంలో అణువణువూ పరిశీలించింది.

పులివెందుల టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సర్వేయర్లతో ఇంటి మ్యాప్‌ను సీబీఐ అధికారులు తయారు చేస్తున్నారు. వివేకా ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ ఆమె కుమార్తె సునీత దగ్గరుండి సీబీఐ అధికారులకు చూపించారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఓ గది తలుపు తెరుచుకుని ఉన్న విషయాన్ని సునీత.. సీబీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  

Exit mobile version