Site icon TeluguMirchi.com

విధిరాతను ఎవరు మార్చలేరు అంటున్న అమితాబ్..

రీసెంట్ గా బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫామిలీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. బిగ్ తో పాటు కుమారుడు , కోడలు , మనవరాలు ఇలా అందరికి వైరస్ సోకింది. బిగ్ బి , అభిషేక్ ముంబై లోని నానావతి హాస్పటల్ లో కరోనా చికిత్స తీసుకుంటుండగా..ఐశ్వర్యారాయ్, ఆమె కూతురు మాత్రం వారం రోజులుగా ఇంట్లో చికిత్స తీసుకుంటూ వచ్చారు.

కానీ రోజు రోజుకు కరోనా లక్షణాలు పెరుగుతుండడం తో వారు కూడా హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం నలుగురు నానావతిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే బిగ్ హాస్పటల్ లో ఎలా ఉన్నారని అభిమానులంతా ఆరాతీస్తుండగా…తాజాగా అమితాబ్ బ్లాగులో కొన్ని విషయాలు ప్రస్తావించారు.

నా గతం ఏమిటి? ఏది మంచి? ఏది చెడు? అన్నది ఆలోచిస్తాను అని నాన్న హరివంశరాయ్ బచ్చన్ అనేవారుట. ఇన్నాళ్లు తన జీవితమంతా విశ్లేషించుకునే తీరిక చిక్కలేదు. మంచి లేదా చెడు ఏమిటో ఆలోచించడానికి సమయం రాలేదు. ఇప్పుడు ఆసుపత్రిలో తన మనస్సులో తన గతానికి సంబంధించిన సంఘటనలను తిరిగి గుర్తు చేసుకున్నానని తెలిపారు.

గజిబిజి జీవితపు హడావిడిలో నేను ఎప్పుడైనా ఎవరి నుంచైనా సహాయం పొందానా? అని ఎక్కడో కూర్చుని కాసేపు ఆలోచించాను .. నేను ఏమి చేసాను.. నేను ఏమి చెప్పాను? నేను ఏది నమ్ముతున్నాను .. ఏది మంచిది? ఏది చెడ్డది? విశ్లేషించుకునేందకు ఇప్పుడు నాకు సమయం దొరికింది అని బ్లాగులో రాశారు.

Exit mobile version