తమిళ్ స్టార్ హీరో విజయ్ ..ప్రస్తుతం మాస్టర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఖైదీ ఫేమ్ లోకేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ ఫై తెలుగు, తమిళ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో తుపాకీ 2 లో నటించేందుకు సిద్దమయ్యాడనే వార్తలు అప్పట్లోనే వైరల్ అయ్యాయి.
ఈ సమయంలోనే తమిళ మీడియాలో నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తో మురుగదాస్ విభేదించాడని స్క్రిప్ట్ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా సినిమా క్యాన్సిల్ అయ్యిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఈ పుకార్ల పై సన్ పిక్చర్స్ సంస్థ స్పందించింది . ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని . దర్శకుడు మురుగదాస్ తో ఎలాంటి విభేధాలు లేవని . .. మా మద్య మంచి వాతావరణం ఉందని సన్ పిక్చర్స్ అధికారిక ప్రతినిధులు పేర్కొన్నారు. స్క్రిప్ట్ విషయంలో మురుగదాస్ పర్ ఫెక్ట్ గా ఉంటాడని అందులో ఎలాంటి డౌట్ లేదని వారు అన్నారు. ఇలాంటి పుకార్లను విజయ్ అభిమానులు నమ్మి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.