వర్మ ఆఫీస్ ఫై దాడి చేసిన పవన్ ఫ్యాన్స్ విడుదల

గురువారం రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఫై దాడి కి పాల్పడిన పవన్ అభిమానులను పోలీసులు వదిలిపెట్టారు.రామ్ గోపాల్ వర్మ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో దాడికి పాల్పడిన ఎనిమిది మందిని జూబ్లీహిల్స్ పోలీసులు వదిలిపెట్టారు.

ురువారం రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఫై దాడి కి పాల్పడిన పవన్ అభిమానులను పోలీసులు వదిలిపెట్టారు.రామ్ గోపాల్ వర్మ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంతో దాడికి పాల్పడిన ఎనిమిది మందిని జూబ్లీహిల్స్ పోలీసులు వదిలిపెట్టారు.

తమ అభిమాన హీరోపై ‘పవర్ స్టార్’ పేరుతో వర్మ సెటైరికల్ మూవీ తీయడం తో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అభిమానులు హెచ్చరికలు జారీచేసిన వర్మ ఏమాత్రం తగ్గకుండా.. ‘‘దమ్ముంటే వచ్చి నాపై దాడి చేయమనండి. నా ఆఫీస్ అడ్రస్ గూగుల్‌లో కొడితే వస్తుంది. ఎమ్మెల్యే కాలనీలో నా కంపెనీ ఉంది’’ అంటూ వర్మ బహిరంగ సవాల్ విసిరారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది గురువారం సాయంత్రం ఆయన ఆఫీసుకు వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వర్మ కార్యాలయం (ఆర్జీవీ కంపెనీ) వద్దకు వెళ్లి హంగామా చేశారు. అక్కడ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహంతో కార్యాలయం కిటికీ అద్దాలు పగలగొట్టారు. ఆఫీసు లోపలికి వెళ్లి వర్మను రమ్మనండి మాట్లాడాలి అంటూ వాదనకు దిగారు. దీంతో ఆర్జీవీ కంపెనీ కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఎనిమిది మంది పీకే ఫ్యాన్స్‌ను అరెస్ట్ చేశారు.