ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.
1943 జూన్లో జన్మించిన వంగపండు ప్రసాదరావు.. దాదాపు 300లకు పైగా పాటలు రాశారు. ఇక ఆయన రాసిన చాలా పాటలను సినిమాల్లోకి కూడా తీసుకున్నారు. ‘‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా’’ అంటూ ఆయన రాసి, పాడిన పాట ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు మారుమోగింది. ఈయన మృతి పట్ల తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు , రచయితలు , కళాకారులు సంతాపం తెలుపుతున్నారు.