లూసిఫర్ వినాయక్ కు కాదట..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పక్క అగ్ర హీరోగా రాణిస్తూనే..మరోపక్క నిర్మాతగా తన సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటికే చిరంజీవి తో రెండు భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ సాధించిన చరణ్..ప్రస్తుతం కొరటాల – చిరంజీవి కలయికలో చిరు 152 వ చిత్రాన్ని మ్యాట్నీ మూవీస్ సంస్థ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన మోహన్ లాల్ చిత్రం ‘లూసిఫర్’ హక్కుల్ని కొనుగోలు చేసాడు చరణ్.

ఈ చిత్రాన్ని సాహో డైరెక్టర్ సుజిత్ కు ఇచ్చారని..తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు స్క్రిప్ట్ రాస్తున్నారని మొన్నటి వరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ లోపే సుజిత్ స్క్రిప్ట్ చిరంజీవి కి పెద్దగా నచ్చకపోవడం తో వినాయక్ కు డైరెక్ట్ చేసే బాధ్యతలు ఇచ్చారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల ఫై స్పదించిన చిత్ర యూనిట్..ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని , సుజితే డైరెక్ట్ చేస్తున్నాడని తెలిపింది.