ప్రతి ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా మొదలై లాల్‌దర్వాజ బోనాలు ఏడాది మాత్రం కరోనా కారణంగా నిరాడంబరంగా మొదలయ్యాయి. పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు విశిష్ఠమైనవని నగరవాసులు చెబుతుంటారు. తెల్లవారు జాము 3 గంటలకే బోనాల సందడి ప్రారంభమైంది. మొదట అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు.
సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శాంతి కళ్యాణం జరగనుంది. అక్కన్న-మాదన్న ఆలయాలతో పాటు అన్ని పురాతన అమ్మవారి ఆలయాల్లో పూజలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఆలయ కమిటీ ఉత్సవాలు నిర్వహిస్తోంది. భక్తులను లోపలికి అనుమతించడం లేదు. ఆది, సోమవారాలలో భక్తులను ఆలయాలలోకి అనుమతించరు. ఆలయ కమిటీ వారు మాత్రమే బోనాల సమర్పిస్తున్నారు.