రామ్ కు అండగా నిలిచిన చంద్రబాబు

స్వర్ణా ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై హీరో రామ్ ట్వీట్ చేయడం.. దానిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదంగా మారింది. తన అభిప్రాయాలు సోషల్ మీడియాలో చెబితేనే ఆయనకు పోలీసులు నోటీసులిస్తామని హెచ్చరికలు చేయడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

రామ్‌పై ఏసీపీ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా… నోటీసులు ఇస్తామని బెదిరించడం సరికాదని … రాష్ట్రంలో ప్రాధమిక హక్కులను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు