రామోజీ ఫిలిం సిటీ లో రొమాంటిక్

అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో పూరి తనయుడు ఆకాష్ హీరోగా పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం రొమాంటిక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం మే 29 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసారు కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ప్రస్తుతం క్లైమాక్స్ స‌న్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ షాట్స్ ను తీస్తే సినిమా పూర్తవుంతుంది. అయితే సెప్టెంబర్ లో చిత్రబృందం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ బ్యాలెన్స్ పార్ట్ షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రమ్యకృష్ణ ప్లేస్ లో మందిరా బేడి ఆల్ రెడీ నటించిందట. కానీ ఆ సీన్స్ బాగా రాకపోవడంతో మందిరా బేడి ప్లేస్ లో రమ్యకృష్ణను పెట్టి ఆ సీన్స్ ను రీషూట్ చేశారు.

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.