Site icon TeluguMirchi.com

రాఖీ పండగను చిరు ఎలా జరుపుకున్నారో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఈమధ్యనే సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చి అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. సినిమా తాలూకా విశేషాలతో పాటు అనేక అంశాలను షేర్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా రాఖీ పండుగ సందర్భంగా తన ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవికి రాఖీ కట్టి నోరు తీపి చేసి ఆశీర్వాదం తీసుకోగా, వాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకొని ఆనందంగా గడుపుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంతే కాకుండా ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘నా చెల్లెళ్లిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.’’ అని రాసుకొచ్చారు.

నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
Happy #RakshaBandhan ! pic.twitter.com/DAZrypOm5B— Chiranjeevi Konidela (@KChiruTweets) August 3, 2020

Exit mobile version