బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కాగా సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోగా, దీనిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దీనిలో భాగంగా చాలామందిని ఇప్పటికే విచారించిన ముంబై పోలీసులు తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత మహేశ్ భట్ వాంగ్మూలాన్ని కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో మహేశ్ భట్ని కూడా పోలీసులు విచారించనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు. ఆయనతో పాటు కరణ్ జోహర్ మేనేజర్నూ విచారణకు పిలిచినట్లు ఆయన తెలిపారు. మరోవైపు సుశాంత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న నటి కంగనా రనౌత్కూ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.