లాక్ డౌన్ కారణంగా చిత్రసీమ దారుణంగా పడిపోయింది. సినిమా షూటింగ్ లు లేక, థియేటర్స్ బంద్ కావడం తో సినీ నిర్మాతలు , కార్మికులు ,తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యనే ప్రబుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వడం తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసారు.
తాజాగా విజయ్ సేతుపతి లాభం కోసం డబ్బింగ్ మొదలుపెట్టాడు. విజయ్ సొంత నిర్మాణ సంస్థతో పాటు 7పీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై లాభం సినిమా నిర్మితమవుతోంది. జననాథన్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మిగిలిన షూటింగ్ పూర్తి చేసేలోపు సినిమా డబ్బింగ్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయాలని మేకర్స్ భావించడంతో డబ్బింగ్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీ లో విజయ్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది.