రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొనగా..తాజాగా పాటల రచయత చంద్రబోస్ పాల్గొన్నారు .
సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి విసిరిన చాలెంజ్ స్వీకరించి మణికొండలోని తన నివాసంలో మొక్కలు నాటారు సినీ గేయ రచయిత చంద్రబోస్. వృక్షో రక్షతి రక్షిత:అనే సిద్ధాంతాన్ని నమ్ముతానని ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా మంచి కార్యక్రమమని ప్రముఖ గీత రచయత చంద్రబోస్ అన్నారు.
మన జీవితం,సమాజం ,భవిష్యత్ పచ్చగా ఉండాలంటే పచ్చని చెట్లే మూలాధారం అని పేర్కొన్నారు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగామ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ ,ప్లేబ్యాక్ సింగర్ ఎం.ఎం.శ్రీలేఖ ,సినీ దర్శకులు మున్నా ముగ్గురికి చంద్రబోస్ చాలెంజ్ విసిరారు.